![]() |
![]() |

శనివారం జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్, కంటెస్టెంట్స్ కి ఒక టాస్క్ ఇచ్చాడు. "ఇప్పుడు మీకు ఇస్తున్న టాస్క్.. 'ఫస్ట్ ఇంప్రెషన్ లాస్ట్ ఇంప్రెషన్ టాస్క్'. ఒకరి తర్వాత ఒకరు వచ్చి, మొదటి వారం నుండి ఇప్పటివరకు ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉంది? ఇప్పుడు లాస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉంది. వారితో ఇన్ని రోజులు ఎలా ఉన్నారు. మీకు ఎలా అనిపించిందో" చెప్పండని బిగ్ బాస్ అన్నాడు.
ఆ తర్వాత ఒక్కొక్కరుగా వచ్చి తమ అభిప్రాయాలని చెప్తూ అనుభవాలను పంచుకున్నారు. శ్రీహాన్ మాట్లాడుతూ "నేను హౌస్ లోకి వచ్చినప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ గా కీర్తి ఉంది. అప్పటి నుంచి మేం ఇద్దరం మంచి ఫ్రెండ్స్ గా ఉన్నాం. నువ్వు స్ట్రాంగ్ కీర్తి. అసలు ఇంతవరకు రావడం మాములు విషయం కాదు" అని మాట్లాడాడు.
ఆ తర్వాత ఆదిరెడ్డి మాట్లాడుతూ, "ఫస్ట్ వీక్ లో రేవంత్ ని చూసి.. ఒక యాటిట్యూడ్ చూపిస్తున్నాడని అనుకున్నాను. ఆ తర్వాత అది అతని సహజ గుణమని తెలిసింది" అని చెప్పాడు. అతని తర్వాత రోహిత్ వచ్చి ఆదిరెడ్డి గురించి మాట్లాడాడు. అలాగే రేవంత్ వచ్చి మాట్లాడుతూ, "ఆదిరెడ్డి రివ్యూయర్ కాబట్టి పెద్ద మానిపులేటర్ అని అనుకున్నాను. ఫస్ట్ నుండి నన్ను అర్థం చేసుకోలేదని అనుకున్నాను. కాని తర్వాత తెలిసింది నేనే ఆదిరెడ్డిని అర్థం చేసుకోలేదని" చెప్పాడు. ఆ తర్వాత కీర్తి వచ్చి మాట్లాడుతూ, "శ్రీహాన్ ని మొదట ఫేక్ అని అనుకున్నాను. వారాలు గడుస్తూ ఉంటే తెలిసింది. ఒక పర్సన్ ని నేను ఇంత రాంగ్ గా జడ్జ్ చేసానని.. ఇప్పుడు అయితే బాగా కలిసిపోయాం" అని చెప్పింది.
![]() |
![]() |